ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Police Commissioner of Vijayawada: నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తా: సీపీ

Police Commissioner of Vijayawada: విజయవాడ నూతన సీపీగా కాంతి రాణా టాటా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నగరంలో నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. మహిళలు, పిల్లలు, వృద్ధులకు భరోసా ఇచ్చే దిశగా చర్యలు చేపడుతామన్నారు.

ips Kanthi Rana Tata
ips Kanthi Rana Tata

By

Published : Dec 8, 2021, 3:25 PM IST

Updated : Dec 8, 2021, 3:32 PM IST

Police Commissioner of Vijayawada: విజయవాడ నగర పోలీస్ కమిషనర్​గా కాంతి రాణా టాటా బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో.. కాంతి రాణా టాటా విజయవాడలో డీసీపీ, జాయింట్ సీపీగా విధులు నిర్వర్తించారు. తనపై విశ్వాసం ఉంచి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు ఇచ్చిన సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్​లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

నేరాలపై ప్రత్యేక దృష్టి..
CP Kanthi Rana Tata On Crimes: విజయవాడ నగరంలో నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తానని నూతన సీపీ కాంతి రాణా స్పష్టం చేశారు. ట్రాఫిక్ అంశాలపై తనకు అవగాహన ఉందని.. వాహనదారుల కష్టాలు తీర్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు.

గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని, అలాగే బ్లేడ్ బ్యాచ్ నేరాలను సిటీలో అదుపు చేస్తామని స్పష్టం చేశారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. మహిళలు, పిల్లలు వృద్ధులకు భరోసా ఇచ్చే చర్యలు చేపడతామని కాంతి రాణా చెప్పారు. సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతి, ఉద్దేశపూర్వకంగా చేసే వాటిపై చర్యలు తప్పవన్నారు.

ఇదీ చదవండి:

సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్- నలుగురు మృతి

Last Updated : Dec 8, 2021, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details