స్థానిక సంస్థల ఎన్నికలపై ఈనెల 28న రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించే సమావేశంలో ఒక్కో పార్టీకి పది నిమిషాలు కేటాయించనున్నారు. ఒకరి తరువాత ఒకరు విధానంలో పార్టీల తరఫున హాజరయ్యే ప్రతినిధుల అభిప్రాయాన్ని ఎన్నికల కమిషనర్ తెలుసుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 18 రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు వీటిలో ఉన్నాయి.
స్థానిక ఎన్నికలపై అభిప్రాయాల వెల్లడికి ఆహ్వానం
స్థానిక సంస్థల ఎన్నికలపై అభిప్రాయాలు వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 18 రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఈనెల 28న నిర్వహించే సమావేశంలో ఒక్కో పార్టీకి పది నిమిషాలు కేటాయించనున్నారు.
స్థానిక ఎన్నికలపై అభిప్రాయాల వెల్లడికి ఆహ్వానం