ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించండి.. సీఎం జగన్​కు ఆహ్వానం - cm jagan for Tungabhadra Pushkaralu

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు సీఎం జగన్​ను కలిశారు. తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించేందుకు రావాలని ఆహ్వానించారు. నిధులు మంజూరు చేసి పుష్కర ఘాట్లు, రహదారులను తీర్చిదిద్దినట్టు ముఖ్యమంత్రి వారికి వివరించారు.

Invitation for Jagan to Tungabhadra Pushkaralu
సీఎం జగన్​కు ఆహ్వానం

By

Published : Oct 20, 2020, 7:54 PM IST

తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ను మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు ఆహ్వానించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద పుష్కరాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్టు రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.

అనంతరం సీఎంకు ఆహ్వాన పత్రికను, జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. నవంబరు 20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాల కోసం ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేసి పుష్కర ఘాట్లు, రహదారులను తీర్చిదిద్దినట్టు సీఎం వారికి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details