దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని సిర్పూర్కర్ కమిషన్ సుదీర్ఘంగా విచారించింది. సురేందర్ రెడ్డి విచారణ ముగిసిన తర్వాత దిశ హత్యాచారం కేసులో సాక్షిగా ఉన్న రాజశేఖర్ అనే ప్రభుత్వ ఉద్యోగిని కమిషన్ ప్రశ్నించింది. సురేందర్ రెడ్డిని ఆరు రోజుల పాటు ప్రశ్నించారు. గత నెల 21, 26,27,28 తేదీలతో పాటు... ఈ నెల 1,2 తేదీల్లో సురేందర్ రెడ్డిని ప్రశ్నించారు.
DISHA: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో త్రిసభ్య కమిషన్ సుదీర్ఘ విచారణ - telangana varthalu
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో విచారణ కొనసాగుతోంది. సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని సిర్పూర్కర్ కమిషన్ సుదీర్ఘంగా విచారించింది. ఇవాళ ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబ సభ్యుల సాక్ష్యం తీసుకోనుంది.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో త్రిసభ్య కమిషన్ సుదీర్ఘ విచారణ
ఎన్‌కౌంటర్ ఘటనకు సంబంధించి పలు అనుమానాలను కమిషన్ తరఫు న్యాయవాది లేవనెత్తగా... వాటికి సురేందర్ రెడ్డి సమాధానాలిచ్చారు. దిశ ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబ సభ్యుల నుంచి సాక్ష్యాలను ఇవాళ్టి నుంచి సేకరించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో కొనసాగుతున్న విచారణ