- నేషనల్ హెల్త్ సర్వీస్ పార్లమెంటరీ అవార్డుకు షార్ట్ లిస్ట్ అవ్వడం పై మీ స్పందన ఏంటి.. ?
సంతోషంగా ఉంది. నేను నామినేట్ అవుతానని అనుకోలేదు. ఆసుపత్రి వాళ్లు రికమండ్ చేస్తే... యుకే వాయువ్య ప్రాంతం నుంచి నా పేరును ఎంపీల కమిటీ సిఫారసు చేశారు. ఆశ్చర్యంగానూ.. సంతోషంగానూ ఉంది.
- యుకేలో ఈ అవార్డుకు ఉన్న ప్రాధాన్యత ఏంటి... ఎంపిక ఎలా జరుగుతుంది..?
ఎన్హెచ్ఎస్ ప్రారంభించి ఇప్పటికి 72 ఏళ్లు అయింది. ఒక్కో రంగంలో ఒక్కక్కరిని ఎంపిక చేస్తారు. ఇందులో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ కేటగిరికి నన్ను నామినేట్ చేశారు.
- ఈ అవార్డును ఎక్కడ అందజేస్తారు.. ? ఇంతకు ముందు మన తెలుగు వారు ఎవరైనా దీనిని గెలుచుకున్నారా.. ?
దీనిని యుకే పార్లమెంట్లో అందజేస్తారు. ఎన్హెచ్ఎస్ వ్యవస్థాపకదినం సందర్భంగా.. జూలై 7న ఇస్తారు. దీనికి ప్రత్యేకమైన బాధ్యతలుండవ్. కానీ అవార్డు పొందడం అనేది ఓ గౌరవం. గెలుపొందిన వారు ఆ తర్వాత అవార్డు ఎంపిక కమిటీల్లో బాధ్యతలు నిర్వర్తిస్తారు.
- యుకే ఆరోగ్య వ్యవస్థలో ఎన్హెచ్ఎస్ పాత్ర ఏంటి.. ? ఈ పార్లమెంటరీ అవార్డు గెలుచుకున్న వారి బాధ్యతలు ఏముంటాయి. ?
యుకేలోని నేషనల్ హెల్త్ సర్వీసు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా... గర్భం నుంచి గతించేవరకూ ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించడం అనేది ఎన్హెచ్ఎస్ ప్రధాన లక్ష్యం. ప్రజలు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన పనిలేకుండా వైద్యులను సమకూరుస్తుంది. చాలా తక్కువ దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఎన్హెచ్ఎస్ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల ఆదరణ పొందుతోంది.
- క్లినికల్ ఆంకాలజిస్ట్ అయిన మీరు.. పరిశోధన రంగంలోనూ.. అలాగే కమ్యూనిటీకి చేసిన సేవలను గుర్తించి.. మిమ్నల్ని బలపరుస్తున్నట్లు.... మీ పేరును ప్రతిపాదించిన పార్లమెంటేరియన్.. జెఫ్ స్మిత్ తెలిపారు.. మీరు చేసిన పరిశోధనలు, సేవ పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా..?
నేను ఇక్కడకు రాకముందే చండీగఢ్ పీజీఐలో కేన్సర్ వైద్యాన్ని అభ్యసించాను. ఆ తర్వాత ఓ కన్సల్టెంట్ ఆహ్వానంపై మాంచెష్టర్లో చేరాను. పిల్లల కాన్సర్పై ప్రత్యేక ఆసక్తితో 44ఏళ్లుగా ఈ రంగంలోనే పరిశోధనలు చేస్తున్నారు. చిన్నారులు, కౌమార వయసుల్లో కేన్సర్ అరుదు. నేను చేరిన కొత్తల్లో ఎలాంటి కేన్సర్లు వస్తాయన్న దానిపై అవగాహన లేదు. అప్పట్లో కేవలం 35శాతం మంది మాత్రమే జబ్బు నుంచి బయటపడేవారు. ఈ 44 ఏళ్ల కాలంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ చేసి.. చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశాం. పిల్లల్లో కేన్సర్ కు చికిత్స ఎలా ఇవ్వాలో అవగాహన లేని స్థాయి నుంచి ఇప్పుడు 75శాతం వరకూ కేన్సర్లను నయం చేసే స్థితికి వచ్చాం. అంతర్జాతీయంగా పాల్గొని.. జాతీయ స్థాయిలో సమన్వయం చేసినవాడిని ఇన్నేళ్లలో నేనొక్కడినే.. నేను రిటైర్ అవుతుండటంతో నా స్థానంలో ఆరుగురుని నా ఆసుపత్రిలో నియమించారు. పెద్ద వాళ్ల లాగా కాన్సర్ చికిత్స అందించి.. ఏ ఐదేళ్ల జీవితాన్ని అందించడం కాదు.. చిన్న పిల్లల్లో చికిత్స అందిస్తే.. వారు 70-80ఏళ్ల వరకూ జీవిస్తారా అన్నది అప్పట్లో ఎలాంటి అవగాహన లేదు. నేను స్వీయానుభవంతో చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశాను. నేను చికిత్స అందించిన వందలాది మంది రోగులను నిరంతరం ఫాలోఅప్ చేస్తూ.. వచ్చాను.
- మీరు పనిచేస్తున్న క్రిష్టే ఆసుపత్రి యూరోప్ లోనే అత్యుత్తమ కేన్సర్ ఇనిస్టిట్యూట్ అని చెబుతారు. చాలా వరకూ కేన్సర్ స్టేజింగ్ లు కూడా అక్కడ నిర్థరించారు.. ఆ ఆసుపత్రి ప్రత్యేకత ఏంటి.. ?
ఆ ఆసుపత్రి కేన్సర్ రోగులకు మాత్రమే చికిత్స అందిస్తుంది. నేను మొదటి నుంచి చిన్న పిల్లలు, టీనేజ్ యువత, బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్లకి చికిత్స అందిస్తూ వచ్చాను. నేను అందించిన చికిత్స.. దానికి వచ్చిన స్పందన అనేది నాకు సంతృప్తినిచ్చింది.
- మీరు దాదాపు 44 ఏళ్లు ఆ ఆసుపత్రిలోనే వర్క్ చేస్తున్నారు.. ఇంత సుదీర్ఘంగా ఆ ఆసుపత్రిలో పనిచేసిన వారున్నారా.. ? మీకు ఆసుపత్రిలో ఉన్న అనుబంధం ఎలాంటిది.. ?
నలభై నాలుగు సంవత్సరాలు ఆసుపత్రుల్లో పనిచేసిన వారుంటారు. ఓ కన్సల్టెంట్ గా ఈ దేశానికి వచ్చి.. ఒకే ఆసుపత్రిలో 44 ఏళ్ల పాటు.. సేవలందించడం అరుదైన విషయమే.. ! నాకు తెలిసి చాలా తక్కువమంది ఉంటారు అనుకుంటా.. !
- కేన్సర్ కు సంబంధించి.. మరో ప్రముఖ నిపుణులు నోరి దత్తాత్రేయుడు గారు.. కూడా మీకు సహాధ్యాయి. కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకున్న మీరు ప్రఖ్యాత అంకాలజిస్టులుగా మారారు. ఇది కాకతాళీయంగా జరిగిందా...?