కర్ణాటకలో పర్మిట్ లేకుండా తిరుగుతున్న ఆరెంజ్ బస్సులను యలహంక ప్రాంతీయ రవాణా అధికారులు సీజ్ చేశారు. యలహంక ప్రాంతీయ రవాణా అధికారి ప్రకాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రహదారిపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి నాలుగు బస్సులు సీజ్ చేశారు. పలు రాష్ట్రాలకు నడుపుతున్న బస్సులకు అనుమతులు లేవని గుర్తించారు. రాష్ట్ర అనుమతులు, పన్ను చెల్లింపులు లేవని అధికారులు తెలిపారు.
కర్ణాటకలో పర్మిట్ లేని ఆరెంజ్ బస్సులు సీజ్
కర్ణాటకలో పర్మిట్ లేకుండా తిరుగుతున్న నాలుగు అంతర్రాష్ట్ర బస్సులను అధికారులు సీజ్ చేశారు. వాటిలో ఆరెంజ్ బస్సులు పట్టుబడ్డాయి.
orange buses sized at karnataka
రిజిస్ట్రేషన్లు తీసుకురావాలని అధికారులు బస్సు యజమానులకు నోటీసులు జారీ చేశారు. పత్రాలను సమర్పించిన తర్వాత జరిమానాల మొత్తం తెలుస్తుందని యలహంక ప్రాంతీయ రవాణా అధికారులు ప్రకాష్ తెలియజేశారు.
ఇదీ చదవండి: సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసులో కర్ణాటకలో ఆరుగురు అరెస్ట్