ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఘనంగా ‘అంతర్జాల నాటకోత్సవం’ ప్రారంభం - ఏపీ వార్తలు

‘అంతర్జాల నాటకోత్సవం’ శనివారం వర్చువల్‌గా ఘనంగా ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన తెలుగు సంఘాలు రూపొందించిన నాటికలు ప్రదర్శించారు. ఇతర రాష్ట్రాల్లో కనుమరుగవుతున్న తెలుగు నాటక ప్రదర్శనల్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో నాటకోత్సవాలను ప్రారంభించినట్లు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు తెలిపారు.

internet dance compititon start
internet dance compititon start

By

Published : Oct 24, 2021, 8:50 AM IST

రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అంతర్జాల నాటకోత్సవం’ శనివారం వర్చువల్‌గా ఘనంగా ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన తెలుగు సంఘాలు రూపొందించిన నాటికలు ప్రదర్శించారు. పుణె ఆంధ్రా సంఘం కళాకారులు ‘అత్తగారు- ఆవకాయ’ హాస్యనాటిక, బళ్లారి రాఘవ కళామందిర్‌ ఆధ్వర్యంలో ‘కరోనా కాలంలో కళాజీవి’ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు.

వర్చువల్‌గా జరిగిన సమావేశంలో.. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో కనుమరుగవుతున్న తెలుగు నాటక ప్రదర్శనల్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో నాటకోత్సవాలను ప్రారంభించినట్లు వివరించారు. కార్యక్రమం ఆదివారం కొనసాగుతుందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో సినీ నటుడు సాయికుమార్‌, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ అధ్యక్షుడు శివకుమార్‌ పాల్గొన్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:TIRUMALA HUNDI INCOME: తిరుమల శ్రీనివాసుడి హుండీ ఆదాయం ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details