TS Intermediate Results 2022: తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు వెల్లడించనున్నారు. తాజాగా ప్రక్రియ మొత్తం పూర్తైనందున తప్పులు రాకుండా సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తామన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్.
Inter Results: ఇవాళ తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల - సబితా ఇంద్రారెడ్డి తాజా సమాచారం
TS Intermediate Results 2022: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు వెల్లడించనున్నారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ గతంలోనే ప్రకటించారు.
1
మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు. మే 6 నుంచి 24 వరకు పరీక్షలు జరగ్గా... మొదటి సంవత్సరంలో సుమారు 4 లక్షల 64 వేల మంది హాజరయ్యారు. రెండో సంవత్సరంలో దాదాపు 4 లక్షల 39 వేల మంది పరీక్షలు రాశారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ గతంలోనే ప్రకటించారు.
ఇవీ చదవండి: