ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. ఈసారీ బాలికలదే హవా - తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇంటర్​ ఫలితాలను ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్​ ఫస్టియర్​లో 63.32 శాతం, సెకండియర్​లో 67.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

1
1

By

Published : Jun 28, 2022, 12:13 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. రెండో సంవత్సరంలో 67.82 శాతం ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నెల 30 నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

మొదటి సంవత్సరంలో బాలికలు 72.33శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 54.20శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో 75.86శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. 60శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

'కరోనా వల్ల గడిచిన రెండేళ్లు అందరం ఇబ్బందిపడ్డాం. విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్‌లైన్‌లో విద్యా బోధన చేశాం. ఈ ఏడాది 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించాం. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సిలింగ్‌లు కూడా నిర్వహించాం. పరీక్షల తేదీలు 2, 3 సార్లు మారటం వల్ల విద్యార్థులు కొంత ఇబ్బందిపడ్డారు.' -- సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details