మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్ - ఏపీలో మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు
17:15 April 28
ap inter exams
ఇంటర్ పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వర్చువల్ సమీక్ష జరిపారు. జేసీలు, ఆర్ఐవో, డీఈవోలతో మాట్లాడిన ఆయన..షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఇంటర్ పరీక్షలు అనివార్యమని అందరూ గుర్తించాలని తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదని గుర్తు చేశారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పూర్తి చేసిన అధికారులకు మంత్రి సురేష్.. అభినందనలు తెలిపారు. ఇంటర్ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు.
ఇదీ చదవండి
కొవిడ్ కేంద్రాల్లో ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటాం: ఆళ్ల నాని