ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం రెండో విడత ఆన్‌లైన్ దరఖాస్తులను నేటి నుంచి ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మొదటి విడత గడువు ఆగస్టు 27తో ముగిసిందని, కళాశాలలను ఎంపికకు ఐచ్ఛికాలు ఇచ్చిన వారికి త్వరలోనే సీట్లు కేటాయించనున్నామని వెల్లడించారు. మొదటి విడతలో పొందిన సీటుపై సంతృప్తి చెందని వారు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్ ప్రవేశాలపై ఏమైన సందేహాలు ఉంటే 18002749868 టోల్‌ఫ్రీ నంబరులో సంప్రదించాలని కోరారు.
ఇంటర్మీడియట్ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
నేటి నుంచి ఏడో తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
inter online applications