ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు సెప్టెంబరు ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 188 రోజులపాటు తరగతులను నిర్వహించనున్నారు. రెండో శనివారమూ కళాశాలలు కొనసాగుతాయి. టర్మ్ సెలవులు ఉండవు.
ఈమేరకు అకడమిక్ క్యాలండర్‌ను ఇంటర్ విద్యా మండలి విడుదల చేసింది. పబ్లిక్ పరీక్షలు మార్చి మొదటి వారంలో ఉంటాయి. తరగతులు ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులిస్తారు. అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలను మే చివరి వారంలో నిర్వహిస్తారు. జూన్ ఒకటి నుంచి 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
సప్లిమెంటరీ పరీక్ష రుసుం గడువు పొడిగింపు