inter exams : ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు మే ఆరో తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ మొదటి విడత షెడ్యూలు మారడంతో ఇంటర్ విద్యామండలి కొత్త షెడ్యూలును రూపొందించింది. గురువారం దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా తెలంగాణ షెడ్యూలు తరహాలోనే ఉండొచ్చని సమాచారం. మే 6 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. ఇంటర్ పరీక్షల తేదీలు మారడంతో.. పదో తరగతి పరీక్షలను మే 2 నుంచి నిర్వహించాలా? ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక మే 23 నుంచి నిర్వహించాలా? అనేదానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది.
inter exams : మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు? - ఏపీ వార్తలు
inter exams : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మే ఆరో తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. నేడు దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
inter exams