ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటర్‌ విద్యాశాఖ ఏడీపై సస్పెన్షన్‌ వేటు! - Inter Education Department AD suspended

Inter Education Department AD suspended: తెలంగాణ ఇంటర్‌ విద్యాశాఖ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న కేఎం ప్రసన్న లత సస్పెన్షన్​కు గురయ్యారు. ఆమెను సస్పెండ్​ చేస్తూ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంటర్‌ విద్యాశాఖ ఏడీ ప్రసన్నలత
ఇంటర్‌ విద్యాశాఖ ఏడీ ప్రసన్నలత

By

Published : Aug 9, 2022, 12:15 PM IST

Inter Education Department AD suspended: తెలంగాణ ఇంటర్‌ విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)గా పనిచేస్తున్న కేఎం ప్రసన్న లతను సస్పెండ్‌ చేస్తూ ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తండ్రి పీటర్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఆమె 1993లో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత పదోన్నతులు పొంది.. ప్రస్తుతం ఏడీగా కొనసాగుతున్నారు.

కారుణ్య నియామకం కింద ఉద్యోగంలో చేరాలంటే.. ఆ కుటుంబంలోని వారు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులై ఉండరాదు. అయితే.. తల్లి సౌభాగ్యమ్మ అప్పటికే ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమె 2010లో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం పింఛను పొందుతున్నారు. ఆ విషయాన్ని వెల్లడించకుండా అక్రమంగా ఉద్యోగం పొందినందుకు ప్రసన్న లతను సస్పెండ్‌ చేశారు.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details