ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. పారదర్శకంగా ఇంటర్ అడ్మిషన్లు జరపాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి మిరియాల శేషగిరి బాబు స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం అడ్మిషన్లు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు కూడా తప్పనిసరిగా నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఈ నెల 20 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని.., వచ్చే నెల ఒకటి నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. అడ్మిషన్ల కోసం కళాశాలలు ఎలాంటి ప్రచారం చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Inter Admissions: ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల - ఇంటర్ షెడ్యూల్
ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. జులై 1 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అడ్మిషన్ల కోసం ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల