Piyush goyal: ధాన్యం కొనుగోళ్ల అంశంపై జరిగిన భేటీలో పీయూష్ గోయల్, తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కేంద్రం ధాన్యం సేకరణ చేయదని మంత్రులకు గోయల్ తేల్చి చెప్పారు. ఇప్పుడున్న విధానాన్ని ప్రజల కోసం మార్చాలని ప్రశాంత్ రెడ్డి కోరగా... మీరు దిల్లీలో ఎలాగో సత్తాలోకి వస్తారు కదా... అప్పుడు మార్చండంటూ పీయూష్ స్పందించారు. భగవంతుడు దయతలిస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తామని ప్రశాంత్ రెడ్డి బదులిచ్చారు. భాజపా కూడా ఇద్దరితో మొదలై.. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వచ్చిందని గుర్తు చేశారు.
Piyush goyal: "మీరు దిల్లీలో ఎలాగో సత్తాలోకి వస్తారు కదా...అప్పుడు మార్చండి" - piyush goyal news
Piyush goyal: కేంద్రం ధాన్యం సేకరణ చేయదని తెలంగాణ మంత్రులకు గోయల్ తేల్చి చెప్పారు. ఇప్పుడున్న విధానాన్ని ప్రజల కోసం మార్చాలని తెలంగాణ మంత్రి కోరగా... మీరు దిల్లీలో ఎలాగో సత్తాలోకి వస్తారు కదా... అప్పుడు మార్చండంటూ పీయూష్ ఎద్దేవా చేశారు. భగవంతుడు దయతలిస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తామని సమాధానమిచ్చారు ఆ మంత్రి. అసలేం జరిగిందంటే...
Piyush goyal: ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భేటీకి పిలిచిన గోయల్.. 15 నిముషాల పాటు సమావేశాన్ని నిలిపివేశారు. కిషన్ రెడ్డి రాకపోవటంతో భేటీ కొనసాగించారు. బయట దుకాణంలో ఏది అమ్ముడు పోతుందో అదే కొంటామని చెప్పారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై భాజపా నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను కేంద్రమంత్రికి ప్రశాంత్ రెడ్డి చూపించారు. పంజాబ్ లో సేకరించిన విధంగా తెలంగాణలో ఎందుకు సేకరణ చేయరని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ చేయమని.. బియ్యం మాత్రమే తీసుకుంటామని పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: Polavaram: పోలవరం ప్రాజెక్ట్ డిజైన్లపై చర్చించేందుకు నిపుణుల కమిటీ
TAGGED:
piyush goyal news