ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Prasad Scheme Temples: 'ప్రసాద్‌' పథకంలో భద్రాచలం ఆలయానికి చోటు

Bhadrachalam Temple in Prasad Scheme: తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధే లక్ష్యంగా ''ప్రసాద్​ జాతీయ మిషన్‌''ను కేంద్ర పర్యాటకశాఖ అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఈ పథకంలో తెలంగాణలోని భద్రాచలం ఆలయాన్ని చేర్చి.. అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనుంది. త్వరలో దీనిపై తుది నిర్ణయం రానుంది.

integrated-development-of-pilgrimage-destinations-bhadrachalam-temple-in-prasad-scheme
'ప్రసాద్‌' పథకంలో భద్రాచలం ఆలయానికి చోటు

By

Published : Dec 24, 2021, 9:24 AM IST

Bhadrachalam Temple in Prasad Scheme: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో, పరిసరాల్లో సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రానున్నాయి. ‘ప్రసాద్‌’ పథకంలో భద్రాచలం ఆలయాన్ని చేర్చనున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. త్వరలో తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం, విశాఖ జిల్లా సింహాచలం ఆలయాలను కూడా ‘ప్రసాద్‌’లో చేర్చాలని మంత్రి నిర్ణయించారు. ఈ పథకం కింద ఆలయ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక పర్యాటకులకు సౌకర్యాల్ని మెరుగుపరచడంతో పాటు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తారు. ఇంకా పర్ణశాల, సీతావాగు ప్రాంతంలో సైతం కొత్త సౌకర్యాల్ని కల్పించడంతో పాటు ఉన్నవాటిని మెరుగుపరుస్తారు.

ఏటా 30 లక్షల మంది ఆధ్యాత్మిక పర్యాటకులు

తీర్థయాత్ర స్థలాలు, వారసత్వ సంపదకు సంబంధించిన స్థలాల్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రసాద్‌ (తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి) జాతీయ మిషన్‌ను కేంద్ర పర్యాటకశాఖ అమలు చేస్తోంది. రూ.92.04 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనల్ని రాష్ట్ర పర్యాటకశాఖ ద్వారా ప్రభుత్వానికి పంపించామని పర్యాటక అభివృద్ధి సంస్థ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు.

ఇదీ చూడండి:TTD: జనవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల

ABOUT THE AUTHOR

...view details