ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇకపై గ్రామవార్డు సచివాలయాలకు పరిహారం అందించే బాధ్యతలు - బాధిత కుటుంబాలకు పరిహారం అందించనున్న సచివాలయాలు

వైఎస్సార్ బీమా, మత్స్యకార భరోసా, పశు నష్ట పరిహార పథకం, రైతు ఆత్మహత్యల ఘటనల్లో పరిహారం అందించే బాధ్యతలను గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Insurance exgratia
బాధిత కుటుంబాలకు సత్వర పరిహారం

By

Published : Jul 2, 2021, 2:16 PM IST

వైఎస్సార్ బీమా, మత్స్యకార భరోసా, పశు నష్ట పరిహార పథకం, రైతు ఆత్మహత్యల ఘటనల్లో పరిహారం అందించే బాధ్యతల్ని గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకనుంచి ఈ భీమా పథకాల అమలు, సమన్వయ బాధ్యతల్ని సంబంధిత జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయాలు చూస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

మత్స్యకార భరోసా కింద 10 లక్షలు, రైతు ఆత్మహత్యల ఘటనల్లో 7 లక్షలు, పశు నష్ట పరిహార పథకం కింద 15 వేలు, వైఎస్ఆర్ బీమా కింద సాధారణ స్థితిలో మరణిస్తే 1 లక్ష రూపాయలు, ప్రమాదవశాత్తూ మృతి చెందితే 5 లక్షల బీమాను కుటుంబాలకు అందేలా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details