ఎన్నికలు జరిగే పట్టణాల్లో పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి.. మద్యం విక్రయాలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కలెక్టర్లను ఆదేశించారు. ఓట్ల లెక్కింపునకు 24 గంటల ముందు కూడా మద్యం విక్రయాలు నిలిపివేయాలని సూచించారు. అత్యవసర విభాగాల్లో తప్ప మిగతా ప్రభుత్వ శాఖల్లోని వాహనాలను ఎన్నికల అవసరాలకు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసినా, ఓటర్లను ప్రలోభపెట్టినా ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎస్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.
48 గంటల ముందు మద్యం విక్రయాల బంద్ - మద్యం విక్రయాలు బంద్
పల్లె పోరు ముగిసి.. ఇప్పుడు పట్టణ పోరు మెుదలు కానుంది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి.. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను మద్యంతో ప్రలోభ పెట్టే అవకాశం ఉండటంతో.. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే మద్యం విక్రయాలు నిలిపివేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
48 గంటల ముందు మద్యం విక్రయాల బంద్