ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐఐటీటీయం విద్యాసంస్థల్లో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభం

ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ..ఈ ఏడాదికి చెందిన అడ్మిషన్లను ప్రారంభించింది. భారత పర్యటక మంత్రిత్వ శాఖ స్థాపించిన విద్యా సంస్థలు గ్వాలియర్ ,భవనేశ్వర్,నోయిడా, నెల్లూరులలో ఉన్నాయని తెలిపింది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ , పీజీ ప్రవేశాలకు అడ్మిషన్ ప్రక్రియ అక్టోబర్ 31 వరకు కొనసాగుతుందని తెలిపింది.

By

Published : Oct 23, 2020, 4:36 PM IST

Published : Oct 23, 2020, 4:36 PM IST

Institute Of Tourism in ap
Institute Of Tourism in ap

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటిటియం), నెల్లూరు, పర్యటక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ..ఈ సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభించింది. అడ్మిషన్ కమిటీ కన్వీనర్ సంజీవ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. పర్యటక రంగాన్ని జీవనోపాధిగా మలుచుకోవాలనుకునే ఔత్సాహికులు... భారత పర్యటక మంత్రిత్వ శాఖ స్థాపించిన ఈ విద్యా సంస్థలు గ్వాలియర్ , భవనేశ్వర్, నోయిడా, నెల్లూరులలో ఉన్నాయని తెలిపారు.

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ ప్రవేశాలకు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. అడ్మిషన్​ల కోసం, మరిన్ని వివరాలకు తమ అధికారిక వెబ్ సైట్ www.iittmsouth.org ను సందర్శించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి:కరోనా కాలంలోనూ ఇంటింటికీ తిరిగి వైద్యం

ABOUT THE AUTHOR

...view details