తనిఖీ పూర్తయిన వారికే పింఛను
నోటీసులు అందుకున్న లక్ష మందికిపైగా లబ్ధిదారుల్లో సరైన ధ్రువపత్రాలను అందించిన వారికే జులై 1న పింఛను అందిస్తారు. కర్నూలు జిల్లాలో 11వేల మందికి, కృష్ణాలో 14వేల మందికి, విజయనగరంలో 8వేల మందికి, చిత్తూరు జిల్లాలో 16వేల మందికి నోటీసులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 80వేల మందికిపై లబ్ధిదారుల వివరాల పరిశీలన పూర్తయింది. వీరిలో 6వేల మంది వరకు అనర్హులున్నట్లు పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) అధికారులు గుర్తించారు. తనిఖీలో ఎక్కువగా ఒంటరి మహిళ కాకున్నా ఆ కేటగిరీలో పింఛన్లు పొందుతున్నారని గుర్తించారు. ఈ నెల 30 వరకు తనిఖీ ప్రక్రియ కొనసాగనుంది. అప్పటికీ పరిశీలన పూర్తికాని వారి పింఛన్లను ఆపుతారు. తనిఖీలను కొనసాగిస్తారు. జులై 15లోగా సరైన వివరాలు అందించిన వారికి పింఛను ఇస్తారు. ఆ తర్వాత ధ్రువపత్రాలు అందిస్తే రెండు నెలలదీ ఒకేసారి ఆగస్టు 1న అందిస్తారు.