సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో విచారణ జరిగింది. ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఆదేశాలు విచారణకు అడ్డురావని పిటిషనర్ రేవంత్ రెడ్డి ధర్మాసనానికి తెలిపారు. సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు ఎన్జీటీకి వివరించారు.
సుప్రీం ఆదేశాల్లో విచారణ జరపాలని పేర్కొనలేదని ఎన్జీటీ వెల్లడించింది. కూల్చివేతకు పర్యావరణ అనుమతులపై ఎన్జీటీ తేల్చవచ్చని పిటిషనర్ చెప్పగా.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 12కి వాయిదా వేసింది.