ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థానిక ఎన్నికల వాయిదాపై నేడు సుప్రీంలో విచారణ

inquiry-in-supreme-court-tomorrow-against-postponement-of-ap-local-elections
inquiry-in-supreme-court-tomorrow-against-postponement-of-ap-local-elections

By

Published : Mar 17, 2020, 7:14 PM IST

Updated : Mar 18, 2020, 3:33 AM IST

19:12 March 17

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) ప్రకటించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎన్నికలను వాయిదా వేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. కరోనా వైరస్‌ ఆందోళన నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. అయినా ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. యథాతథంగా ఎన్నికలు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొంది. 

కేవియట్ పిటిషన్..

మరోవైపు ఇదే అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టనున్న నేపథ్యంలో తమ వాదనను కూడా వినాలని కోరింది. ఆ తరువాతే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. 

స్థానిక ఎన్నికల వాయిదాతో ఎస్​ఈసీపై సీఎం జగన్ సహా మంత్రులంతా తీవ్ర స్థాయిలో ఘూటు వ్యాఖ్యలు చేశారు. రమేశ్ కుమార్​ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.  తాజాగా ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయడం..ఎస్​ఈసీ కూడా కేవియట్ వేయడంతో స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 

ఇదీ చదవండి : 

'ఉద్దేశాలను ఆపాదించటం రాజ్యాంగ విధులను అడ్డుకోవడమే'

Last Updated : Mar 18, 2020, 3:33 AM IST

ABOUT THE AUTHOR

...view details