ఏపీలో పలు ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు లేవని దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీలో విచారణ జరిగింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టారని జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్ధరించింది. ఈ మూడు ఎత్తిపోతల పథకాలు పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదన్న కేంద్ర జలశక్తి శాఖ నివేదికతో ఎన్జీటీ ఏకీభవించింది. ఈ మూడు ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు: ఎన్జీటీ
12:26 September 09
ఏపీలో పర్యావరణ అనుమతులు లేవని దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీలో విచారణ
పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో ముందుకెళ్లొద్దని ఆదేశించింది. మిగిలిన రెండు ఇప్పటికే నిర్వహణలో ఉన్నందున పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఎన్జీటీ తెలిపింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టినందకు జరిమానా, పరిహారం అంచనాపై కేంద్ర పర్యావరణ శాఖ, సీపీసీబీ, రాష్ట్ర సీపీసీబీ, ఉభయగోదావరి జిల్లా కలెక్టర్లతో కూడిన కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. పర్యావరణ పరిహారం, జరిమానా అంచనా వేసిన 6 నెలల్లో వసూలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 12కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:సీతానగరం శిరోముండనం నిందితులకు, వైకాపా నాయకులకు ఊరట