ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్వరలోనే రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ: మంత్రి కన్నబాబు - kannababu

రైతుల పంటలకు అధిక ధరలు వచ్చేందుకు వీలుగా మార్కెట్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. రైతులకు త్వరలోనే ఇన్​పుట్ సబ్సీడీ చెల్లింపులు చేస్తామని ఆయన తెలిపారు. అమరావతిలో వ్యవసాయ మిషన్​పై సీఎం సమీక్ష నిర్వహించారు.

రైతులకు త్వరలోనే ఇన్​పుట్ సబ్సీడీ చెల్లింపులు: మంత్రి కన్నబాబు

By

Published : Sep 14, 2019, 4:40 PM IST

రైతులకు త్వరలోనే ఇన్​పుట్ సబ్సీడీ చెల్లింపులు: మంత్రి కన్నబాబు

రైతు ఉత్పత్తుల విక్రయానికి అధిక ధరలు వచ్చేందుకు వీలుగా మార్కెట్ ఇంటెలిజెన్స్ ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. తక్కువ వర్షపాతం కురిసే చోట చిరు ధాన్యాల పంటలు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారని ఆయన వెల్లడించారు. రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఇన్​పుట్ సబ్సిడీ బకాయి పడిందని... ఆ బకాయిలను ఈ నెలలో చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు....
రైతులు పండించే ఉత్పత్తి విక్రయాలకు ప్రభుత్వం రవాణా భరించి మార్కెట్లకు తరలించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగుళూరు వంటి ఇతర మార్కెట్​లకు ఉత్పత్తులను తరలిస్తామన్నారు. మినుములు, పెసలు, కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి...అక్టోబరు 15 నాటికి సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

మార్కెటింగ్ సౌకర్యాలే ప్రధాన లక్ష్యం....
మార్కెట్​లో ధరలు లేకపోవడం సంక్షోభమని... ఉత్పత్తి కంటే మార్కెటింగ్ చాలా ఇబ్బందిగా ఉందని వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి తెలిపారు. రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలన్నదే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయాలని, దాని కోసం అర్హులైన రైతులు నష్టపోకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు నాగిరెడ్డి వెల్లడించారు.

ఇవీ చూడండి-ధరల స్థిరీకరణకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం: సీఎం

ABOUT THE AUTHOR

...view details