అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం రైతులు, మహిళలు.. రహదారిపైనే సామూహికంగా బట్టలు ఉతికారు. దాదాపు 300 మంది మహిళలు బట్టలు ఉతికి తమ నిరసన తెలియజేశారు. 48 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న రైతులు... రాజధాని ప్రాంతంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినూత్న నిరసన.. రోడ్డుపై బట్టలు ఉతికిన మహిళలు - అమరావతి వార్తలు
అమరావతి ప్రాంత మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డుపైనే బట్టలు ఉతికిన మహిళలు.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ప్రభుత్వం మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు.
రోడ్డుపై బట్టలు ఉతికిన రాజధాని ప్రాంత మహిళలు