ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - rains in ap latest news

రాష్ట్రంలో 4 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు వివరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు.

Inland people need to be vigilant says meteorological officials
రాష్ట్రంలో 4 రోజులపాటు వర్షాలు

By

Published : Aug 12, 2020, 7:35 PM IST

వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం రేపు ఏర్పడనుంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు. తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కమిషనర్‌ కన్నబాబు వివరించారు. 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details