తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఏ తల్లి కన్నబిడ్డో తెలీదు గాని ఓ పసికందు చెత్తకుప్పలో...రక్తంతో తడిసి శవంగా కనిపించింది. ఖలీల్వాడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట ఉన్న చెత్తకుప్పలో రోజుల వ్యవధి కల్గిన పసికందు మృతదేహం లభ్యమైంది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ పడేసి వెళ్లినట్లుగా చెబుతున్నారు.
TS News: నిజామాబాద్ జిల్లాలో దారుణం.. చెత్తకుప్పలో పసికందు మృతదేహం - telangana top news
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఖలీల్వాడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట ఉన్న చెత్తకుప్పలో రోజుల పసికందు మృతదేహం లభ్యమైంది.
చెత్తకుప్పలో పసికందు మృతదేహం లభ్యం
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి:return from Afghanistan: అఫ్గానిస్థాన్ - శ్రీకాకుళం జర్నీ