మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖలోని పలు విభాగాలపై మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈడీబీలో ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో మరింత మెరుగ్గా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమ పెట్టాలనుకునే సామాన్యులకు అనువైన విధానాలను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనతో పాటే నైపుణ్యం, ఉపాధి కల్పనపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి గౌతమ్ రెడ్డి సూచించారు.
'పరిశ్రమలు పెట్టాలనుకునే సామాన్యులకూ అనువైన విధానాలు తీసుకురావాలి' - ఏపీలో పరిశ్రమల అభివృద్ధిపై తాజా వార్తలు
పరిశ్రమ పెట్టాలనుకునే సామాన్యులకూ అనువైన విధానాలు తీసుకురావాలని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖలోని పలు విభాగాలపై మంత్రి సమీక్షించారు.
Industries minister goutham reddy review on industries
TAGGED:
industries in ap latest news