ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిపై ఇటీవల బెంగళూరు విమానాశ్రయంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి తదనంతర పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. విజయ్ సేతుపతికి, నిందితునికి పోలీసు స్టేషన్లోనే రాజీ కుదిరిందని విజయ్ చెప్తున్నా వివాదం సద్దుమణిగేలా కనిపించట్లేదు.
హిందూ మక్కల్ కట్చి తాజాగా సంచలన ప్రకటన చేసింది. విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తికి ఒక్కో తన్నుకు రూ.1001 నగదు బహుమతి అంటూ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ప్రకటించింది. తమ దైవాన్ని అవమానించిన విజయ్ సేతుపతి క్షమాపణ చెప్పేవరకూ ఈ బహుమతి ఉంటుందని తెలిపింది.
కానీ.. ఈ ఘటనను విజయ్ సేతుపతి చిన్నదిగా కొట్టిపడేశారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి అలా ప్రవర్తించారని, సమస్య పోలీసు స్టేషనులోనే పరిష్కారమైందని వెల్లడించారు. కానీ, హిందూ మక్కల్ కట్చి మాత్రం సమస్యను మరింత పెద్దది చేసేలా ప్రకటన చేయడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.