train collision protection system 'Kavach': దక్షిణమధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజన్‌లోని లింగంపల్లి-వికారాబాద్ సెక్షన్‌లో శుక్రవారం ఒకే రైల్వే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా రాబోతున్నాయి. ఒక రైల్లో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉంటారు. మరో దాంట్లో రైల్వేబోర్డు ఛైర్మన్, సీఈవో వినయ్‌కుమార్ త్రిపాఠి ఉంటారు. అత్యంత సమీపానికి వచ్చి ఆగిపోతాయి. రైళ్లకు ఆటోమెటిక్ బ్రేకులు పడి ఇలా పూర్తిగా ఆగిపోయినప్పుడు రెండింటి మధ్య సుమారు 200 మీటర్ల దూరం ఉండనున్నట్లు సమాచారం. దక్షిణమధ్య రైల్వేలో ఓ అధికారి ‘ఈనాడు’కి ఈ విషయం తెలిపారు. ఎదురెదురుగా ఈ రైళ్లు సమీపానికి రాకముందే ఆపేందుకు మానవ ప్రయత్నం ఏమీ జరగదు. స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికతతో రూపొందించిన రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ ఆ రైళ్లను గుర్తించి ప్రమాదం జరగకుండా నివారిస్తుంది. ఇంతక్రితం సాంకేతిక సిబ్బంది తనిఖీలు నిర్వహించి ఈ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు.
ఏమిటీ కవచ్...