మాల్దీవులో చిక్కుకున్న భారతీయులను ఆపరేషన్ సముద్ర సేతులో వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా 700 మంది భారతీయులను నౌకాదళం భారత భూభాగానికి తీసుకువచ్చింది. వీరంతా మాల్దీవుల నుంచి ట్యూటీకొరన్ పోర్టుకు చేరుకున్నారు. ఇప్పటివరకు 2వేల 874 మంది భారతీయులను జలాస్వ స్వదేశానికి తీసుకొచ్చింది.
స్వదేశానికి చేరుకున్న మరో 700 మంది భారతీయులు - వందే భారత్ మిషన్ వార్తలు
మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులు ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా భారత భూభాగానికి చేరుకున్నారు. వీరందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించి, స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆపరేషన్ సముద్ర సేతు
ఈ నౌక శ్రీలంక, మాల్దీవుల నుంచి భారతీయులను భారత భూభాగానికి చేర్చింది. కోవిడ్ నియంత్రణ పద్ధతులను పాటిస్తూ వారందరికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి స్వస్థలాలకు వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:'భారత్ గొప్ప శక్తిగా ఎదగడం ఖాయం'