ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

167 ఏళ్లు పూర్తి చేసుకున్న మన రైల్వే - భారతీయ రైల్వేకు 167 ఏళ్లు

భారతీయ రైల్వేకు 167 ఏళ్లు నిండాయి. ప్రతి ఏటా ఏప్రిల్ 16న రైల్వే సంస్థ వారోత్సవాలు నిర్వహించేది. కానీ దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కారణంగా వేడుకలు జరపలేదు. దేశంలో రైల్వే... శిఖరాగ్ర సంస్థగా విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం కరోనా దెబ్బతో రైల్వే రవాణా స్తంభించిపోయింది.

indian railway
indian railway

By

Published : Apr 17, 2020, 4:26 PM IST

బ్రిటీషు హయాంలో భారతీయ రైల్వేలు 1853 సంవత్సరం ఏప్రిల్‌ 16 నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. మొదటి ప్యాసింజర్‌ రైలు ముంబయి- థానే మధ్య నడిపించారు. నేటితో భారతీయ రైల్వే ప్రస్థానానికి 167 ఏళ్లు. మొట్టమొదటి రైలు ప్రారంభించిన నాడు దేశం మొత్తం సంబరాలు జరుపుకోగా నేడు రైల్వే వ్యవస్థ మొత్తం కరోనా దెబ్బతో స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కేవలం గూడ్స్‌ రైళ్లు మినహా ఏ ఒక్క ప్యాసింజర్‌ రైలు నడవట్లేదు.

ABOUT THE AUTHOR

...view details