భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను గల్ఫ్‌లోని తెలుగు సంఘాలు ఘనంగా నిర్వహించాయి. కువైట్ లో జరిగిన ఈ వేడుకకు తెలుగు సంఘాల ఐక్య వేదిక - కువైట్ ఆధ్వర్యంలో వర్చవల్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 8 తెలుగు సంఘాల భాగస్వామ్యమయ్యాయి. ముఖ్యఅతిథిగా కువైట్‌లోని భారత రాయభారి సిబీ జార్జి హాజరయ్యారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ప్రత్యేక అతిథిగా.. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
75వ స్వాతంత్య్ర వేడుకలను గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాలు కలిసి చేసుకోవడం సంతోషంగా ఉందని.. తెలుగు సంఘాల ఐక్య వేదిక- కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు తెలిపారు. ఈ కార్యక్రములో భాగస్వాములైన తెలుగు కళాసమితి- బహరైన్, తెలుగు కళా సమితి - ఒమన్, ఆంధ్ర కళావేదిక - ఖతార్, తెలుగు అసోసియేషన్ - సౌదీ అరేబియా, తెలుగు కళాస్రవంతి - అబుదాబి, తెలుగు కుటుంబాలు - ఫుజైరియ, తెలుగు తరంగిణి.. సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.