INDEPENDENCE CELEBRATIONS: రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖులు మొదలు అన్ని వర్గాల ప్రజలూ.. పిల్లలూ పెద్దలు జాతీయ జెండా ఎగురవేసి.. దేశభక్తిని చాటుకున్నారు. హైదరాబాద్లోని నివాసంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జాతీయ జెండా ఎగురవేశారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నంద్యాలలో జరిగిన జెండా వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని.. జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. సీఎస్ సమీర్ శర్మ ఉద్యోగులతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు - INDEPENDENCE
75TH INDEPENDENCE రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు మొదలు, పాఠశాలలు, పార్టీ ఆఫీసులు జాతీయ జెండాలతో రెపరెపలాడాయి. పిల్లల నుంచి పెద్దల వరకు జాతీయగీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు.
INDEPENDENCE CELEBRATIONS
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. హిందూపురంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు 75 కేజీల కేక్ కట్ చేసి పంద్రాగస్టు సంబరాలు జరిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెదేపా ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతం యానంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇవీ చదవండి: