ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP FIRE ON GOVERNMENT: 'జగన్ పాలనలో కంటే బ్రిటీష్ హయాంలోనే భేష్' - తెదేపా న్యూస్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. జగన్ పాలనలో కంటే బ్రిటీష్ పాలనలోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ఎద్దేవా చేేశారు.

'జగన్ పాలనలో కంటే బ్రిటీష్ హాయంలో మైరుగైన పరిస్థితులున్నాయి'
'జగన్ పాలనలో కంటే బ్రిటీష్ హాయంలో మైరుగైన పరిస్థితులున్నాయి'

By

Published : Aug 15, 2021, 1:22 PM IST

జగన్ రెడ్డి పాలన కంటే బ్రిటీష్ పాలనలోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జగన్ రెడ్డి రెండున్నరేళ్లుగా అంబేడ్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. స్వతంత్ర భారతవణిలో వాక్ స్వాతంత్య్రం లేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ ఎంపీ లాల్​జాన్ భాషా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి:75వ స్వాతంత్య్ర దినోత్సవం..రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

ABOUT THE AUTHOR

...view details