పండుగ సీజన్... పెరిగిన ప్లాట్‌ఫాం టికెట్ల ధరలు - Increased Platform Ticket Prices In Festive Season at hyderabad
పండుగ దృష్ట్యా రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే... సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచనుంది. ప్రస్తుత టికెట్ ధర 10 రూపాయలు ఉండగా... పండుగ సీజన్లో అది 20 రూపాయలు అవ్వనుంది.
increased-platform-ticket-prices-in-festive-season-at-hyderabad
సంక్రాంతి సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్,కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫారం టికెట్ ధరలను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్ తెలిపారు.పండుగ సందర్భంగా ప్రయాణికులతో పాటు ఎక్కువ మంది వస్తుంటారు. ఆ రద్దీని తగ్గించడంలో భాగంగా టికెట్ ధరను పెంచినట్లు వివరించారు. ప్రస్తుత టికెట్ ధర 10 రూపాయలు ఉండగా ఇవాళ్టి నుంచి ఈనెల 20 వరకు దాన్ని 20 రూపాయలకి పెంచారు.