యావత్ భక్త జనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణలోని యాదాద్రి మహాసంప్రోక్షణ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భక్తులకు ప్రధానాలయంలోకి అనుమతించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా... మంత్రులు, ప్రధాన ప్రజాప్రతినిధులు... మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా యాదాద్రికి తరలివచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలు, ఆలయనగరిలో హెలిపాడ్ సిద్ధం చేశారు. ఇప్పటికే యాదాద్రి ఆలయ ఏర్పాటు పనులను మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, సీపీ మహేష్ భగవత్ పర్యవేక్షిస్తున్నారు.
YADADRI SECURITY: మహాకుంభ సంప్రోక్షణకు పోలీసుల పటిష్ఠ భద్రత.. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూం - భారీ బందోబస్తు
తెలంగాణలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ మహాకుంభ సంప్రోక్షణ పర్వం ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా యాదాద్రి ఆలయంతోపాటు చుట్టూ పరిసరాలలో పోలీసులు భద్రత పెంచారు. ఇప్పటికే రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
తెలంగాణలో మహాకుంభ సంప్రోక్షణకు పోలీసుల పటిష్ఠ భద్రత
మహాసంప్రోక్షణ దృష్ట్యా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. మహాసంప్రోక్షణ వేళ యాదాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశాలమైన రహదారులు పచ్చని మొక్కలతో.. ప్రజాప్రతినిధులు, భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి.
ఇదీ చదవండి:భాకరాపేట ఘటనలో తొమ్మిదికి చేరిన మరణాల సంఖ్య.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి