IT Raids On Real Estate companies: ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపార సంస్థలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన రెండు సంస్థలపై 3 రాష్ట్రాల్లో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పటాన్‌చెరులోని నవ్య డెవలపర్స్, బల్కంపేటలోని స్కందాన్షీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌కు చెందిన కార్యాలయాలు, ఆ సంస్ధల మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్ల ఇళ్లలో, వాటి అనుబంధ సంస్థల్లో కూడా ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.
IT Raids On Real Estate companies : ఐటీ దాడుల కలకలం...మూడు రాష్ట్రాల్లో సోదాలు - తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు
IT Raids On Real Estate companies: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోని స్థిరాస్తి వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేస్తోంది. హైదరాబాద్ పటాన్ చెరులోని నవ్య డెవలపర్స్, బల్కంపేటలోని స్కందాన్షీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై మూడు రాష్ట్రాల్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

IT raids in three states: హైదరాబాద్‌లోని బల్కంపేట, పటాన్‌చెరు, బీరంగూడ, కర్నూలు, అనంతపురం, తాడిపత్రి, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సోదాలు జరుగుతున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. సోదాలు నిర్వహిస్తున్న ప్రాంతాల దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కొనసాగుతున్న దాడుల్లో ఆయా సంస్థలకు చెందిన అన్ని రకాల డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. ఆయా సంస్థలు ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాయి.. కొనసాగుతున్న ప్రాజెక్టులు ఎన్ని? భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఆయా సంస్థల వాస్తవ టర్నోవర్‌కు, పన్నుల చెల్లింపునకు మధ్య వ్యత్యాసాలు ఉండటంతో.. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే తాము సోదాలు నిర్వహిస్తున్నట్టు ఐటీశాఖ వర్గాలు వెల్లడించాయి.
- ఇదీ చూడండి:
- Kabaddi: తిరుపతి వేదికగా జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభం