సర్పంచి, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల్లో జనాభా ఆధారంగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండువేల కంటే తక్కువ జనాభా ఉంటే 5 లక్షలు, 2001 నుంచి 5 వేల వరకు జనాభా ఉంటే 10 లక్షలు, 5001 నుంచి 10 వేల జనాభా ఉంటే 15 లక్షలు, 10 వేలుకు మించి జనాభా ఉంటే 20 లక్షల చొప్పున ప్రోత్సహకాలను ప్రభుత్వం ఆయా పంచాయతీలకు అందిచనుంది.
పంచాయతీలు ఏకగ్రీవమైతే.. అందించే ప్రోత్సాహకాలు ఇవే! - పంచాయతీ ఏకగ్రీవమైతే డబ్బులు ఎంత
ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

incentives for unanimous panchayaths