ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలోని గాంధీ ఆసుపత్రికి వెళ్లనున్న చిరంజీవి, ఎందుకంటే

Chiranjeevi Visits Gandhi Hospital మెగాస్టార్​ చిరంజీవి రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. చిరంజీవి గాంధీ ఆస్పత్రికి వెళ్లడమేంటీ అనుకుంటున్నారా. ఒకవేళ ఏదైనా చికిత్స కోసమైతే నగరంలో పెద్దపెద్ద కార్పొరేట్​ ఆస్పత్రులుండగా, గాంధీ ఆస్పత్రికి ఎందుకొస్తారు. చికిత్స కోసమైతే కాదు, మరి ఇంక దేనికోసం వెళ్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

chiru
chiru

By

Published : Aug 27, 2022, 11:28 AM IST

Chiranjeevi Visits Gandhi Hospital: మెగాస్టార్​ చిరంజీవి త్వరలోనే గాంధీ ఆస్పత్రికి వస్తానని వెల్లడించారు. అయితే వైద్యం కోసం మాత్రం కాదులెండి. ఒకవేళ చికిత్స కోసమే అయితే.. పెద్దపెద్ద కార్పొరేట్​ ఆస్పత్రులున్నాయి. అందులోనూ తన కోడలు కుటుంబానికే నగరంలోని పెద్ద ఆస్పత్రి ఉంది. కాబట్టి చికిత్స కోసం మాత్రం గాంధీకి వెళ్లట్లేదు. ఎదైనా కార్యక్రమం ఉందా.. దానికి అతిథిగా వెళ్తున్నారా అంటే అదీ లేదు. ఒకవేళ గాంధీ ఆస్పత్రిలో ఏదైనా షూటింగ్​ ఉందా.. అంటే అదీ కాదు. మరి గాంధీకి మెగాస్టార్​ ఎందుకు వెళ్లనున్నారంటే..

హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రిలో వృద్ధురాలిని స్పృహలో ఉంచి నిర్వహించిన ఆపరేషన్‌ ఘటన చిరంజీవి చెవిన పడింది. శస్త్రచికిత్స సమయంలో ఆమెకు ట్యాబ్‌లో చిరంజీవి నటించిన "అడవి దొంగ" సినిమా చూపిస్తూ, తరచూ మాట్లాడుతూ మెదడులో కణితిని తొలగించారు. ఈ ఘటన మీడియా ద్వారా చిరంజీవి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన శక్రవారం తన పీఆర్‌వో ఆనంద్‌ను గాంధీకి పంపించి వివరాలు తెలుసుకోమని పంపారు. ఆయన సూపరింటెండెంట్‌ రాజారావును కలవగా.. ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్య సిబ్బందిని రాజారావు పరిచయం చేశారు. తర్వాత వృద్ధురాలిని కలిసి మాట్లాడారు.

తాను చిరంజీవి అభిమానినని, ఆయన సినిమాలన్నీ చూస్తానంటూ ఆ వృద్ధురాలు చెప్పింది. అనంతరం వైద్య బృందంతోనూ చర్చించారు. ఆనంద్‌ అక్కడి నుంచే చిరంజీవికి ఫోన్‌ చేసి విషయాన్ని వివరించారు. చిరంజీవి స్పందిస్తూ వీలు చూసుకుని రెండు మూడు రోజుల్లో గాంధీ ఆసుపత్రిని సందర్శిస్తానని పీఆర్‌వోకు చెప్పగా.. ఆ విషయాన్ని ఆనంద్‌ సూపరింటెండెంట్‌ రాజారావుకు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details