ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'శాసనసభ సమావేశాలకు సిబ్బందిని తీసుకురావద్దు' - ap legislation news

శాసనసభ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిబ్బందని వెంట తీసుకురావద్దని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక బులెటిన్‌ను విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో పలు నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ap assembly
ఏపీ శాసనసభ

By

Published : Jun 14, 2020, 4:45 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో శాసన సభ నిర్వహణకు సంబంధించి పాటించాల్సిన విధివిధానాలతో కూడిన బులెటిన్ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు జారీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల వెంట పీఏలు, వ్యక్తిగత సిబ్బంది, సందర్శకులను తీసుకు రావద్దని సూచనలు జారీ చేశారు. అసెంబ్లీ వెలుపల కేటాయించిన స్థలంలోనే గన్ మెన్ లు ఉండాలని స్పష్టం చేశారు.

మీడియా పాయింట్ లేదు...

కొవిడ్ దృష్ట్యా ఈసారికి మీడియా పాయింట్ ఉండబోదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సభ్యులు ఎవరూ ఆయుధాలను సభలోనికి తీసుకురావొద్దని.. ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయించిన బెల్ ఆఫ్ అర్మ్ లో అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. సభ్యులు ప్లకార్డులు, బ్యానర్లు కర్రలు ఇతర సామగ్రి తేవడం నిషేధమని పేర్కొన్నారు. ఈ సారి సందర్శకుల గ్యాలరీలోకి ఎవరిని అనుమతి లేదని స్పష్టం చేస్తూ బులెటిన్ విడుదల చేశారు.

ఇవీ చదవండి:ఆర్థిక ఇబ్బందులున్నా పద్దు భారీగానే.. 2.60 లక్షల కోట్లు..!

ABOUT THE AUTHOR

...view details