T.D.S. చెల్లింపుల వ్యవహారంలో ఐటీశాఖ ఏపీ ట్రెజరీ విభాగానికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయిస్తున్న T.D.S. మొత్తాలను జమ చేయకపోవడంపై ఐటీ శాఖ వివరణ కోరినట్టు సమాచారం. ఏపీలోని ట్రెజరీ విభాగం ఉన్నతాధికారులతో పాటు అన్ని జిల్లాల ట్రెజరీ, సబ్ ట్రెజరీ అధికారులకు లేఖలు పంపినట్టు తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా ఉద్యోగుల నుంచి వసూలు చేసిన T.D.S. ఐటీ విభాగానికి జమ చేయకపోవటంపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఆలస్యంగా చెల్లిస్తే చట్టప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించినట్లు తెలిసింది.
టీడీఎస్ చెల్లింపుల వ్యవహారంలో ట్రెజరీ విభాగానికి ఐటీ శాఖ నోటీసులు - ట్రెజరీ విభాగానికి ఆదాయపన్ను శాఖ నోటీసులు
నెల నెల ఐటీ శాఖ కు జమ అయ్యే ఉద్యోగుల టీడీఎస్ చెల్లింపులు ఈ ఏడాది కాకపోవడంపై.. ఐటీ శాఖ ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో ట్రెజరీ శాఖకు అధికార్లు నోటీసులు పంపారని తెలిసింది.
tds