కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పడక్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా అనుమానితులను ఉంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 474 క్వారంటైన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు 46,872 పడకలను సిద్ధం చేసింది. అంతేకాకుండా మొత్తం 24,537 అనుమానితులను స్వీయ గృహనిర్బంధంలో ఉంచినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం 5,635 మంది ఉన్నారని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 349కు చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 9కి చేరింది. ఆ తొమ్మిది మందిని డిశ్చార్జి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో వైద్యుల పర్యవేక్షణలో 5,635 మంది
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో వేలాది పడకలు సిద్ధం చేసింది. అలాగే సుమారు 25 వేల మంది అనుమానితులను స్వీయ గృహ నిర్బంధంలో ఉంచి వారి కదలికలను పర్యవేక్షిస్తోంది.
corona patients in ap