ఆంధ్రప్రదేశ్

andhra pradesh

20 కొత్త కేసులకు ఆ మార్కెట్‌ మూలాలే కారణం...!

By

Published : May 13, 2020, 7:46 AM IST

Updated : May 13, 2020, 8:13 AM IST

రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా..అందులో 20 మంది కోయంబేడు మార్కెట్​కు వెళ్లిన వారికి రావడం కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో 10, నెల్లూరులో 9 మందికి ఆ వ్యాపార కేంద్రంతో సంబంధం కారణంగానే వైరస్ సోకటం ఆందోళన కలిగిస్తోంది.

koyambedu market
koyambedu market

తొలుత విదేశీ...ఆ తర్వాత దిల్లీ మూలాలు...ఇప్పుడు కొత్తగా ‘కోయంబేడు’ రాష్ట్రంలో కొవిడ్‌ విస్తృత వ్యాప్తికి కారణమవుతోంది. రాష్ట్రంలో మంగళవారం 33 మంది కరోనా బారిన పడ్డారని ప్రభుత్వం ప్రకటించగా.. ఇందులో 20 మందికి తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లడం వల్లే సోకిందని స్పష్టం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా నమోదైన కేసు ఈ మార్కెట్‌ వల్ల వచ్చిందే అని ప్రకటించడం విశేషం. చిత్తూరు జిల్లాలో 10మందికి, నెల్లూరు జిల్లాలో 9 మందికి ఆ వ్యాపార కేంద్రంతో సంబంధం కారణంగానే సోకింది.

మంగళవారానికి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 2,051కి చేరాయి. ఎనిమిది జిల్లాల్లో సున్నా కేసులు నమోదయ్యాయి. మిగిలిన అయిదు జిల్లాల్లో కొత్త కేసులు రాగా..అందులో మూడు జిల్లాల్లో కొవిడ్‌ విస్తరణకు కోయంబేడు కారణమయింది. కర్నూలులో మరో 9మందికి సోకడంతో.. ఈ జిల్లాలో మొత్తం కేసులు 600సంఖ్య దిశగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లాలో మరో నలుగురు కొవిడ్‌ బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో 10,730 మంది శాంపిళ్లు పరీక్షించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 46కు పెరిగింది.

మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో...
మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికుల్లో 38 మంది వైరస్‌ బారిన పడ్డారు. థానే నుంచి ప్రత్యేక రైలులో 930 మంది గుంతకల్లు వచ్చారు. వీరిలో 650 మంది అనంతపురం జిల్లాకు చెందిన వారు కాగా.. మిగిలిన వారు కర్నూలు జిల్లాకు చెందిన వారు. వారందరినీ క్వారంటైన్‌లో ఉంచారు. వారిలో 250 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..కర్నూలు జిల్లాకు చెందిన 37 మందికి, కడప జిల్లాకు చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర కొవిడ్‌-19 నోడల్‌ అధికారి మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. వీరంతా ముంబయిలోని మసీద్‌ బండారి ఫిష్‌ మార్కెట్‌లో కార్మికులుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

ఏటీఎం మిషన్​లోకి ప్రవేశించిన నాగరాజు

Last Updated : May 13, 2020, 8:13 AM IST

ABOUT THE AUTHOR

...view details