ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాగల మూడు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో హెచ్చరికలు జారీ

TELANGANA WEATHER REPORT: తెలంగాణకు వరుణుడి గండం ఇప్పట్లో తప్పేలా లేదు. రాగల మూడు రోజుల పాటు మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

TELANGANA WEATHER REPORT
రాగల మూడు రోజులు భారీ వర్షాలు

By

Published : Oct 14, 2022, 5:41 PM IST

TELANGANA WEATHER REPORT: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్​నగర్‌, నాగర్​కర్నూల్‌, వనపర్తి, నారాయణపేటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్​నగర్‌, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఈ రోజు నైరుతి రుతుపవనాలు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి వెనుదిరిగాయి. మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 3 రోజుల్లో మధ్య భారత దేశంలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింత వెనుదిరిగే పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

ఈ రోజు ఒక ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి.. సగటున సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 18న ఉత్తర అండమాన్‌ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details