AP governor: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థత - ఏపీ గవర్నర్ తాజా వార్తలు
10:27 November 17
గవర్నర్‌కు అస్వస్థత
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP governor) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో గవర్నర్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గవర్నర్ బిశ్వభూషణ్ ఆరోగ్యం బాగుండాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. బిశ్వభూషణ్ త్వరగా కోలుకోవాలని దేశానికి సేవచేయాలని కోరుకున్నారు.
ఇదీ చదవండి: