అనంతపురం జిల్లాలో..
- మడకశిర మండలం యు.రంగాపురం గ్రామంలోని రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన లారీ క్యాబిన్ లో 17 మద్యం బాటిల్స్ పట్టుబడ్డాయి. స్వాధీనం చేసుకున్న పోలీసులు తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదుచేశారు.
- మనూరు గ్రామ తాండాలో దాడులు నిర్వహించగా మంజునాయక్ అనే వ్యక్తి వద్ద 42 కర్ణాటక మద్యం పాకెట్లు గుర్తించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
- కక్కల పల్లి గ్రామ సమీపంలో కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 207 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
మట్కా కేంద్రాలపై దాడులు
అనంతపురం జిల్లాలోని హిందూపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్నట్లు, పట్టీలు రాస్తున్నట్లు సమాచారం అందడంతో పట్టణ సీఐ బాలమద్దిలేటి, సిబ్బంది దాడులు చేశారు. మేళాపురం సర్కిల్‌లో మట్కా నిర్వాహకులు ఆబాద్‌పేటకు చెందిన అమీర్‌బాషా, చౌడేశ్వరి కాలనీకి చెందిన సికందర్, సత్యసాయి నగర్‌కు చెందిన మునిశంకర్‌ను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2.04 లక్షల నగదు, మట్కా పట్టీలు, 90 ప్యాకెట్ల కర్ణాటక మద్యం, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో...
వీరఘట్టంలో పోలీసులు గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించారు. డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో.. సీఐ శంకర్ రావు, నలుగురు ఎస్సైలు కలిసి ఉదయం నుంచి సుమారు 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తూ.. వీరఘట్టం మీదుగా జిల్లాలోని పలు ప్రాంతాలకు గుట్కా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ జిల్లాలో...