ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు కాన్వాయ్​పై దాడిలో పోలీసుల పాత్ర లేదు: ఐజీ - చంద్రబాబు కాన్వాయ్​పై దాడి ఘటనలో ఐజీ స్పందన వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనలో జరిగిన దాడిపై ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ స్పందించారు. చంద్రబాబు కాన్వాయ్​పై లాఠీ విసిరారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పోలీసు విధుల్లో నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

IG vineeth brizlaal respond in attack on chandrabab canvoy
ఐజీ వినీత్ బ్రిజ్​లాల్

By

Published : Dec 1, 2019, 3:24 PM IST

చంద్రబాబు కాన్వాయ్​పై దాడికి పోలీసులకు సంబంధం లేదన్న ఐజీ

తెదేపా అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనలో తలెత్తిన ఘటనపై ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ స్పందించారు. చంద్రబాబు కాన్వాయ్​పై జరిగిన దాడిలో పోలీసులకు సంబంధం లేదని అన్నారు.

ఐజీ స్పందన ఆయన మాటల్లోనే

"పర్యటనకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు కరకట్ట నుంచి పర్యటన ప్రారంభమైంది. 10.17కు సీడ్ యాక్సెస్ రోడ్డు వద్దకు కాన్వాయ్ చేరుకుంది. నిరసనకారులు బస్సుపైకి చిన్నరాయి, చెప్పును విసిరారు. లాఠీ విసిరారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మధ్యాహ్నం 2 గంటలకు అనుమతి పూర్తయినా.. సాయంత్రం 6 గంటల వరకు పర్యటించారు. లెక్కకు మించి వాహనాలు కాన్వాయ్‌లో వచ్చాయి. దాడికి పాల్పడిన వారిపై 352, 290, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. పోలీసు విధుల్లో నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటాం. దర్యాప్తులో భాగంగా బస్సును సీజ్ చేశాం. బస్సు అద్దం కొంతమేరకు ముందే పగిలి ఉంది" అని ఐజీ వినీత్ బ్రిజ్​లాల్ వివరించారు.

ఇవీ చదవండి:

తీర్పులు చెప్పే స్థితిలో ఉండడం అద్భుత అవకాశం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details