ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

IFS officers Transfers: రాష్ట్రంలో 14 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ - ఏపీ తాజా వార్తలు

IFS officers Transfers: రాష్ట్రంలో 14 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. డీఎఫ్‌వోలు, సబ్‌ డివిజనల్ ఫారెస్టు అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

IFS officers Transfers
ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ

By

Published : Sep 15, 2022, 12:35 PM IST

IFS officers Transfers: రాష్ట్రంలో 14 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎఫ్​వోలు, సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరా జులాజికల్ పార్కు క్యూరేటర్​గా సి.సెల్వాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్​గా ఐఎఫ్ఎస్ అధికారి విగ్నేశ్​ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. శ్రీకాకుళం, ఏలూరు, రంపచోడవరం, అన్నమయ్య ఇలా వేర్వేరు ప్రాంతాల్లోని అటవీ సంరక్షణాధికారులుగా మిగతా 12 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details